ఏపీలో రేపటి నుంచి బార్లు ఓపెన్

ఏపీలో రేపటి నుంచి బార్లు ఓపెన్

విజయవాడ: ఏపీలో బార్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 840 లైసెన్సులను కొనసాగించాలని నిర్ణయించిన సర్కార్..  వచ్చే ఏడాది జూన్ 30 వరకు బార్లను కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే లైసెన్సు రిజిస్ట్రేషన్ చార్జీలను 10 శాతం మేర పెంచింది.  రేపటి నుంచి బార్లు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం బార్ల లైసెన్స్ పై 20 శాతం కోవిడ్ ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించింది. అలాగే  విదేశీ మద్యం, దేశంలో తయారైన విదేశీ మద్యం, బీర్లు, రెడీ టు డ్రింక్ మద్యంపైనా 10 శాతం మేర ఏఈఆర్టీ విధిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.