IIITలో మెస్‌ టెండర్లపై స్టూడెంట్స్ మళ్లీ ఆందోళన

IIITలో మెస్‌ టెండర్లపై స్టూడెంట్స్ మళ్లీ ఆందోళన

బాసర ట్రిపుల్ ఐటీలో మెస్ లపై తరుచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక్కో విద్యార్థికి ఫుడ్ కోసం ప్రభుత్వం రోజుకు 105 రూపాయలు చెల్లిస్తోంది. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీలో శక్తి కిచెన్, S.S క్యారెట్స్, కేంద్రీయ భండార్ లు మెస్ నిర్వహిస్తున్నాయి. IIT, NIT తరహాలోనే  మెస్ లు నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కనీసం 10 ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉన్న సంస్థకు మెస్ అప్పజెప్పాలని కోరుతున్నారు. 

మెస్‌ టెండర్లకు నోటిఫికేషన్‌ ఇస్తే సరిపోదు, ఫైనలైజ్‌ చేసేవరకు ఆందోళన విరమించేది లేదని చెబుతున్నారు. కొత్త మెస్‌ టెండర్లు ఖరారయ్యాకే ఆందోళన విరమిస్తామని.. లేకపోతే తమ ఆందోళన కొనసాగిస్తామని బాసర ట్రిపుల్‌ ఐటీ స్టూడెంట్స్ స్పష్టంచేశారు.

క్యాంపస్ లో మొత్తం 8684 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీరికి  ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్ అందిస్తున్నారు. క్యాంపస్ లో అదనంగా ప్రైవేట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. అయితే మరో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని స్టూడెంట్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.