భారతంలోని శిఖండి పాత్ర నేపథ్యంతో..

భారతంలోని శిఖండి పాత్ర నేపథ్యంతో..

యువరాజ్ గౌడ, నిఖిల్, దీపక్ శెట్టి, ఖ్యాతి, నిఖిత స్వామి ప్రధాన పాత్రల్లో వి గురుమూర్తి తెరకెక్కించిన సినిమా ‘శిఖండి’. పోలా ప్రవీణ్ కుమార్ నిర్మాత. సోమవారం టీజర్‌‌‌‌ను విడుదల చేశారు.  ఈ సందర్భంగా హీరో యువరాజ్ గౌడ మాట్లాడుతూ ‘కథ విన్నప్పుడు ఈ చిత్రంపై నాకు పెద్దగా అంచనాలు ఏర్పడలేదు.   

టీజర్ చూశాక వందరెట్లు నమ్మకం పెరిగింది. మేము ‘శిఖండి’  సినిమా చేశామని గర్వంగా చెప్పుకుంటాం. మహాభారతం నుంచి ఒక గొప్ప విషయాన్ని ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నాం’ అని అన్నాడు. ఈ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉందని ఇతర నటీనటులు చెప్పారు.  డైరెక్టర్ గురుమూర్తి  మాట్లాడుతూ -‘మహాభారతంలోని  ‘శిఖండి’ పాత్ర నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. 

మహాభారతంలోని ఈ పాత్రకు ఇప్పటి కలియుగంలోని కథకు ముడిపెడుతూ ఎలా సినిమా చేశాం అనేది థియేటర్‌‌‌‌లో చూడాలి.  ప్రేక్షకులు హార్ట్ టచింగ్ ఫీల్‌‌తో  బయటకు వస్తారు’ అని చెప్పాడు. ఇలాంటి మంచి సబ్జెక్ట్‌‌తో ఆడియెన్స్ ముందుకు రావడం ఆనందంగాఉందని నిర్మాత పోలా ప్రవీణ్  అన్నారు.