హైదరాబాద్, వెలుగు: సదరన్ డిస్కమ్ సీఎండీ జితేశ్ వి.పాటిల్ ఆదేశాల మేరకు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 21 సర్కిళ్ల పరిధిలో విద్యుత్ ఆఫీసర్లు, సిబ్బంది బస్తీబాట కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ సరఫరా నాణ్యతను మెరుగుపరచడం, వినియోగదారుల అవసరాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. డిస్కమ్కు చెందిన ఉన్నతాధికారులు, సర్కిల్ ఆఫీసర్లు బస్తీలు, కాలనీలు, గ్రామాలను సందర్శించి సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కరించారు. మోత్కూర్ లోని ఎస్సీ కాలనీలో అదనంగా 160 కేవీఏ సామర్థ్యం గల నూతన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేశారు.
