- సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్
సైఫాబాద్, వెలుగు: గ్రామాల్లో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించి, గ్రామాల అభివృద్ధికి వారికి పూర్తి అధికారాలు కల్పించాలని సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆయన ఆధ్వర్యంలో సర్పంచులు బీఆర్‌కే భవన్‌లో పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఉప సర్పంచ్‌తో కలిసి ఉన్న జాయింట్ చెక్ పవర్‌ను రద్దు చేయాలని, 15వ ఆర్థిక సంఘం, పల్లె ప్రగతి నిధులపై సర్పంచులకు పూర్తి అధికారం ఇవ్వాలని భూమన్న యాదవ్ కోరారు. సర్పంచుల గౌరవ వేతనాన్ని రూ.6,500 నుంచి రూ.25 వేలకు పెంచాలని, గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
