కుత్బుల్లాపూర్, వెలుగు: పాము కాటు వేయడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శ్రీకాకుళానికి చెందిన గోపి బతుకుదెరువు కోసం వచ్చి బౌరంపేటలోని ఓ భవనం వద్ద వాచ్మెన్ గా పని చేస్తున్నాడు.
ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు. గురువారం మధ్యాహ్నం డ్యూటీలో ఉండి, సెల్ ఫోన్ చూస్తుండగా.. పాము కాటు వేసింది. కుటుంబసభ్యులు అతన్ని సూరారంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
