రాష్ట్ర కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సవతుల పోరు..నేతల మధ్య విభేదాలతో బీజేపీ బలపడే ప్రమాదం: కె.నారాయణ

రాష్ట్ర కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సవతుల పోరు..నేతల మధ్య విభేదాలతో బీజేపీ బలపడే ప్రమాదం: కె.నారాయణ

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ కాంగ్రెస్ లో  సవతుల పోరు నడుస్తోందని సీపీఐ జాతీయ నేత కె.నారాయణ విమర్శించారు. కాంగ్రెస్ నేతల తీరుతో రాష్ట్రంలో బీజేపీ బలపడే ప్రమాదం ఉందన్నారు. ఈ అంతర్గత విభేధాలను బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ కూడా ఆసరగా చేసుకోవాలని చూస్తుందన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 22ఏ భూముల వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలపైనే తీవ్ర ఆరోపణలు వస్తున్నాయన్నారు.

సీఎం రేవంత్ నిక్కచ్చిగా ఉండి, ఏ తప్పూ చేయకుండా ఉంటేనే మంత్రులు, కిందిస్థాయి నేతల్లో భయం ఉంటుందన్నారు. కానీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎక్కడ తప్పు కనిపిస్తే అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని నారాయణ హెచ్చరించారు.