యూఎస్‌ ఓపెన్ చాంపియన్కు రూ. 52 కోట్ల ప్రైజ్మనీ

యూఎస్‌  ఓపెన్ చాంపియన్కు రూ. 52 కోట్ల ప్రైజ్మనీ

న్యూయార్క్: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ప్రైజ్‌మనీని నిర్వాహకులు భారీగా పెంచారు. ఈ ఏడాది టోర్నీలో సింగిల్స్ విజేతగా నిలిచే చాంపియన్‌కు రికార్డు స్థాయిలో 5.5 మిలియన్‌ డాలర్లు (రూ. 52 కోట్లు) ఇవ్వనున్నారు. గ్రాండ్‌స్లామ్‌ చరిత్రలో ఇదే అత్యధికం. రన్నరప్‌కు 2.8 మిలియన్‌ డాలర్లు (రూ. దాదాపు రూ. 26 కోట్ల 81 లక్షలు) దక్కనున్నాయి.

ఈసారి టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ పూల్‌ను 20 శాతం పెంచడంతో 108 మిలియన్‌ డాలర్ల (రూ. 1034 కోట్లు)కు చేరింది. 2024తో పోలిస్తే ఏకంగా 44 శాతం పెరుగుదల కావడం గమనార్హం. సెమీస్‌ చేరిన ప్లేయర్లకు రూ. 13 కోట్ల 88 లక్షలు, క్వార్టర్‌ఫైనలిస్ట్‌లకు రూ. 7 కోట్ల 46 లక్షలు కేటాయించారు. తొలి రౌండ్‌లో ఆడిన వాళ్లకు కోటి 34 లక్షలు అందజేస్తారు. ప్రధాన డ్రాలో 128 మంది ప్లేయర్లు పోటీపడతారు.