పద్మారావునగర్ / పంజాగుట్ట, వెలుగు: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సద్భావన రన్ నిర్వహించారు. ఎంజీ రోడ్డు సోమాజీగూడ సర్కిల్‌లోని రాజీవ్ గాంధీ విగ్రహం వరకు సాగింది. కమిటీ అధ్యక్షుడు దీపక్ జాన్ పాల్గొన్నారు.
సోమాజీగూడలోని రాజీవ్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సాయి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నాంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి ఫిరోజ్‌ఖాన్ పాల్గొన్నారు. సాంకేతిక విప్లవ సృష్టికర్త రాజీవ్ అని కొనియాడారు.
రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం
ట్యాంక్ బండ్: రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు మోతె శోభన్ రెడ్డి అన్నారు. ఉద్యమకారులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి గురువారం సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు.
