- సీఎం కామెంట్స్‌పై తలసాని ఫైర్
పద్మారావునగర్, వెలుగు: ‘మహంకాళి జాతరకు సీఎం వస్తే స్థానిక ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రికి గౌరవప్రదంగా స్వాగతం పలికిన.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు మంత్రిగా పనిచేసిన..రాజకీయాల్లో సీనియర్‌ను..అయినా..నాపై కనీస గౌరవం లేకుండా సీఎం మాట్లాడిండు..ఆయన వాడిన భాష అహంకారానికి నిదర్శనం’ అని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం నోటిని అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. గురువారం వెస్ట్ మారేడ్ పల్లి క్యాంప్ ఆఫీస్‌లో తలసాని విలేకరులతో మాట్లాడారు.
సీఎం అనే విషయాన్ని మరిచి గౌరవం, సంస్కారం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. సనత్ నగర్ టిమ్స్‌ను తామే కట్టామని చెప్పుకోవడం అవివేకమని, బీఆర్ఎస్ అభివృద్ధి పనులకే ఆయన రిబ్బన్ కటింగ్‌లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో అర్హులైన వారి ఓట్లు తొలగించకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, జాబితాలో పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకునేలా చూడాలని సూచించారు.
