యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దు.. మంత్రి వివేక్ వెంకటస్వామి

యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దు.. మంత్రి వివేక్ వెంకటస్వామి

మెదక్: మెదక్ జిల్లా కేంద్రంలో ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, మంత్రి వివేక్ వెంకటస్వామి, మెదక్  ఎంపీ రఘునందన్ రావు  ర్యాలీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ‘నషా ముక్త్ భారత్’ మంచి కార్యక్రమమని అన్నారు. దేశంలోని యువత మత్తు పదార్థాలకు బానిసవుతున్న పరిస్థితి ఆందోళనకరమని పేర్కొన్నారు. మత్తు పదార్థాల వినియోగం కారణంగా కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయన్నారు.

మత్తు పదార్థాల వ్యతిరేకంగా గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా చేపడుతున్న కార్యక్రమాన్ని మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఒక సందేశంగా నిలుస్తుందని తెలిపారు.యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు.మత్తు రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కార్యక్రమంలో పిలుపునిచ్చారు.