ట్యాంక్‌‌‌‌బండ్‌‌‌‌పై ఆలె నరేంద్ర విగ్రహం పెట్టాలి ..మన ఆలోచన సాధన సమితి డిమాండ్

  ట్యాంక్‌‌‌‌బండ్‌‌‌‌పై ఆలె నరేంద్ర విగ్రహం పెట్టాలి ..మన ఆలోచన సాధన సమితి డిమాండ్

ముషీరాబాద్‌‌‌‌, వెలుగు: భాగ్యనగరానికి పేరు తెచ్చిన టైగర్‌‌‌‌ ఆలె నరేంద్ర విగ్రహాన్ని ట్యాంక్‌‌‌‌బండ్‌‌‌‌పై ఏర్పాటు చేయాలని మన ఆలోచన సాధన సమితి ప్రభుత్వాన్ని డిమాండ్‌‌‌‌ చేసింది. తెలంగాణ వీరులు, యోధుల విగ్రహాలను కూడా అక్కడ ఏర్పాటు చేస్తే భావితరాలకు వారి సేవలు తెలుస్తాయని పేర్కొంది. ఈ మేరకు వచ్చే ఏడాది ఆలె నరేంద్ర 81వ జయంతిని ట్యాంక్‌‌‌‌బండ్‌‌‌‌పై నిర్వహిస్తామని తెలిపింది. 

సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం రాత్రి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆలె నరేంద్ర 80వ జయంతిని సమితి వ్యవస్థాపకుడు కటకం నర్సింగ్‌‌‌‌రావు అధ్యక్షతన నిర్వహించారు. వివిధ పార్టీల, ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరై ఆలె నరేంద్ర ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌‌‌‌, మాజీ ఎమ్మెల్యే పొన్నాల శ్రీరాములు, ఆలె నరేంద్ర కుమారుడు ఆలె జితేంద్ర, బీసీ ఇంటలెక్చువల్‌‌‌‌ ఫోరం అధ్యక్షుడు చిరంజీవులు, రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్‌‌‌‌కుమార్‌‌‌‌గౌడ్‌‌‌‌ పాల్గొన్నారు.