గ్రాండ్ గా106 ఏళ్ల బామ్మ బర్త్‌‌ డే

గ్రాండ్ గా106 ఏళ్ల బామ్మ బర్త్‌‌ డే
  •     నలుగురు కొడుకులు, కుమార్తెతోపాటు 100 మంది కుటుంబసభ్యులు 

హైదరాబాద్ సిటీ, వెలుగు:  నగరంలోని విద్యానగర్ ప్రాంతానికి చెందిన శతాధిక వృద్ధురాలు కిళాంబి అలివేలు 106 బర్త్ డే వేడుకలు ఆమె కుటుంబ సభ్యులు గురువారం గ్రాండ్ గా చేశారు. కుటుంబ సభ్యుల సమక్షంలో అలివేలుతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అలివేలు భర్త కృష్ణమాచార్యులు గతంలో ఎక్సైజ్ డిపార్ట్‌‌మెంట్‌‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు.  

ఆయన కొంతకాలం క్రితం మృతి చెందారు. ఈ దంపతులకు నలుగురు కుమారులు పార్థసారథి, రామానుజాచార్యులు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ కాగా.. రంగనాయకి అనే కుమార్తె ఉన్నారు.  అలివేలు 1921 ఆగస్టు 20న జన్మించారు. ఆమెకు ప్రస్తుతం మనవలు, మనవరాళ్లు, మునిమనవలు, మునిమనవరాళ్లు కలిపి 100 మందికి పైగా కుటుంబ సభ్యులు ఉన్నారు. 106 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, ఇప్పటికీ తన రోజువారీ పనులను స్వయంగా ఆమె చేసుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.