
తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. ఊరూరా తీరొక్క పువ్వులతో బతుకమ్మ పేర్చుకుని ఆడపడుచులూ బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగాణంలో బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా ప్రజా గాయకుడు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న హాజరయ్యారు. ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ కాశిం, వేముల పుష్పక్క, పలువురు ప్రముఖులు, లెక్చరర్లు,విద్యార్థులు వేడుకల్లో పాల్గొన్నారు. డప్పు చప్పుల మధ్య పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు విద్యార్థులు.
►ALSO READ | BSNL బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరలకే హై స్పీడ్ ఇంటర్నెట్.. FTTH ప్లాన్స్ ఇవే..
కాసేపు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉత్సహాన్ని నింపిన గోరేటి వెంకన్న.. బతుకమ్మ పండుగ గొప్ప పండుగని అన్నారు. పూలను కొలిచే పండుగ బతుకమ్మ పండుగని.. బతుకమ్మ పండుగ పై 20కి పైగా పాటలు రాశానని చెప్పారు. తెలంగాణ నేల ఎందరో కవుల పుట్టినిల్లు అని చెప్పారు. స్త్రీలను గౌరవించే పండుగ మన బతుకమ్మ పండుగని అన్నారు గోరేటి వెంకన్న.