ఒకవైపు ఫోన్ రీచార్జీలు.. మరోవైపు డేటా రీచార్జీలు, ఇంకోవైపు డీటీహెచ్ టీవీ కనెక్షన్లు.. నెలనెలా రీచార్జీలకే సగం డబ్బులు ఖర్చవుతున్నాయని ఆందోళన చెందుతున్న వారికి బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. BSNL కొత్తగా ప్రవేశపెడుతున్న ఫైబర్ టు ది హోమ్ (FTTH) ట్రిపుల్ ప్లే సర్వీసులతో హై స్పీడ్ ఇంటర్ నెట్ తో పాటు.. టీవీ ప్రత్యేక రీచార్జ్ చేయకుండా డీటీహెచ్ కనెక్షన్ అందుబాటులోకి తెస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా అత్యంత సరసమైన ధరలలో ఫైబర్-టు-ది-హెూమ్ (FTTH) ట్రిపుల్ ప్లే సేవలని ప్రారంభించింది టెలికాం సర్కిల్ (బీఎస్ఎన్ఎల్) . హైదరాబాద్ నాంపల్లి BSNL కార్యాలయంలో ఈ సేవలకు సంబంధించి పోస్టర్ ను బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ సీజీఎం రత్నకుమార్ ఆవిష్కరించారు.
బీఎస్ఎన్ఎల్ తెలంగాణ, ఎఫ్ టిటిహెచ్ (FTTH) ట్రిపుల్ ప్లే సేవలు ప్రారంభించి... డిజిటల్ లో విప్లవం తీసుకొచ్చిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దేశంలో ఇలాంటి సేవలు ఎక్కడా లేవని, ఏ సర్వీస్ లు ఇంత తక్కువ ధరలో ప్లాన్ లు ఇవ్వడం లేదన్నారు. కేవలం రూ.299, రూ.399తో FTTH సేవలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దీంతో డిజిటల్ కనెక్టివిటీ మరింత వేగవంతం అవుతుందన్నారు.
►ALSO READ | Ola Muhurat Mahotsav: రూ.50వేలకే ఓలా S1, రోడ్‌స్టర్ X స్కూటర్స్.. దసరా 9 రోజులే డిస్కౌంట్స్..
BSNL సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారుల కోసం... ప్రత్యేకంగా రూపొందించబడిన రూ.799 , రూ.199 (జీఎస్టీతో సహా)... అగ్రెసివ్ ధరలతో యాడ్ఆన్ ప్లాన్ లను అందిస్తుందని వెల్లడించారు. ఈ పథకం మూడు అత్యవసరమైన సేవలను ఒకే, శక్తివంతమైన కనెక్షన్లో కలుపుతుందన్నారు. హై-స్పీడ్ వై-ఫై ఇంటర్నెట్ నిరంతర, విశ్వసనీయమైన ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ అని... ఫిక్స్-లైన్ టెలిఫోన్ స్పష్టమైన వాయిస్ కాలింగ్ అని తెలిపారు. ఐపీటీవీ, కేబుల్ టీవీ వైవిధ్యమైన వినోద ఛానెల్స్ సముదాయమని చెప్పారు.
బీఎస్ఎన్ఎల్ కు కేబుల్ టీవీతో 30 ఏళ్ల అనుబంధం ఉందని... సాఫ్ట్ ప్లే ఎండీ కొల్ల కిషోర్ తెలిపారు. 35 వేల మంది కేబుల్ ఆపరేటర్లు ఉన్నారని... bsnl కు ఉన్న టెక్నాలజీ ఎవరకీ లేదని.. కస్టమర్లకు HD లో ఛానల్స్ అందిస్తున్నట్లు వెల్లడించారు.
