
Ola Roadster X: దేశంలోని ప్రజలు పెరిగిన పెట్రోల్ ఖర్చులతో పాటు గ్రీన్ ట్రాన్స్ పోర్ట్ దిశగా మారుతున్న వేళ ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ప్రస్తుతం దేశంలో జీఎస్టీ సంస్కరణల తర్వాత తగ్గుతున్న కార్లు, బైక్స్ రేట్లు ఈ దసరా, దీపావళికి అమ్మకాలను పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో ఈవీ తయారీదారు పండుగ క్యాంపెయిన్ ఓలా ముహురత్ మహోత్సవ్ పేరుతో స్టార్ట్ చేసింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 1 వరకు అంటే తొమ్మిది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
పండుగ ఆఫర్ కింద ఓలా కంపెనీ తన ఎస్1 స్కూటర్లను, రోడ్‌స్టర్ ఎక్స్ మోటార్ సైకిళ్లను రూ.49వేల 999కే విక్రయిస్తోంది. ఈ ఆఫర్ కింద పరిమిత సంఖ్యలోనే ఈవీల అమ్మకం ఉంటుందని ముందుగా వచ్చిన కస్టమర్లకు ఇది అందుబాటులో ఉంటుందని చెప్పింది.
కొత్త పండుగ స్కీమ్ కింద వివిధ మోడల్ రేట్లు ఇలా..
- S1 X (2kWh) scooter : రూ.49,999
- Roadster X (2.5kWh) motorcycle : రూ.49,999
- S1 Pro+ (5.2kWh) scooter : రూ.99,999
- Roadster X+ (9.1kWh) motorcycle : రూ.99,999
ఇతర ఓలా ఈవీల రేట్లు ఇలా..
- S1 Pro+ in 5.2kWh : రూ.లక్ష 69వేల 999
- S1 Pro+ in 4kWh : రూ.లక్ష 51వేల 999
- S1 Pro in 4kWh : రూ.లక్ష 37వేల 999
- S1 Pro in 3kWh : రూ.లక్ష 20వేల 999
- S1 X+ 4kWh : రూ.లక్ష 11వేల 999
- Roadster X (2.5kWh, 3.5kWh, 4.5kWh) : రూ.లక్ష నుంచి రూ.లక్ష 03వేల 999 వరకు
- Roadster X+ 4.5kWh : రూ.లక్ష 27వేల 499
- S1 Pro+ 5.2kWh : రూ.లక్ష 69వేల 999
- Roadster X+ 9.1 kWh : రూ.లక్ష 49వేల 999