పండగలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక

 పండగలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తెలంగాణ పండగలు మన సంస్కృతిని చాటిచెప్పేవన్నారు. అలాంటి పండగలను ప్రతీ ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని చెప్పారు.హైదరాబాద్ అమీర్పేటలోని మహిళాభివృద్ధి శిశుసంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. బాలికలు, మహిళా అధికారులతో కలిసి ఆమె బతుకమ్మ ఆడారు. 

అనాథ పిల్లలను చిన్న చూపు చూస్తే సంహించం
తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ బతుకమ్మ పండగను అధికారికంగా నిర్వహిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దేశవిదేశాల్లో బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయని చెప్పారు.రెండేళ్ల క్రితం అమీన్పూర్లోని అనాథ అమ్మాయిపై జరిగిన అఘాయిత్య ఘటన బాధాకరమన్నారు. దాడికి పాల్పడిన వారికి కోర్టు జీవిత ఖైదు విధించడం సంతోషంగా ఉందని చెప్పారు. అనాథ పిల్లలను తక్కువ చూపు చూస్తే సహించేదని లేదన్నారు. కోర్టు ఇచ్చిన తీర్పు అలాంటి వారికి చెంప పెట్టని అన్నారు.