ENG vs SL: టీ20 వరల్డ్ కప్ సూపర్-8 దశలో శ్రీలంక, ఇంగ్లండ్ జట్ల మధ్య హై వోల్టేజ్ పోరు జరగనుంది. సెమీఫైనల్ అవకాశాలే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. పల్లెకెలె మైదానంలో ఈ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.
టాస్ అనంతరం శ్రీలంక కెప్టెన్ దసున్ షనక మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం.. గత కొన్ని మ్యాచ్‌ల్లో చేజ్ చేయడంలో బాగా రాణించాం.. మా టీం చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది.. గాయాలు ఇబ్బంది పెట్టినా, కొత్త ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేస్తున్నారు.. జట్టులో రెండు మార్పులు చేశాం.. ప్రమోద్ మధుశన్ స్థానంలో చమీర, కుశల్ పెరేరా స్థానంలో కమిల్ మిశారాకు అవకాశం ఇచ్చామని వెల్లడించారు.
ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. మేమూ టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ చేసే వాళ్లం.. ఇది ఇప్పుడు కొత్త సవాల్ గా మారింది.. ధైర్యంగా ఆడి ప్రత్యర్థిపై ఒత్తిడి తెస్తాం.. ఇక్కడే శ్రీలంకపై 3-0తో సిరీస్ గెలిచిన అనుభవం మాకు ఆత్మవిశ్వాసం ఇస్తోంది.. పిచ్‌లు అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి.. ఆరంభంలో ఎలా ఉంటుందో చూసి ఆడతామని చెప్పాడు.
►ALSO READ | Shoaib Akhtar: పాకిస్తాన్ అందుకే ఓడిపోతుంది.. షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు
శ్రీలంక జట్టు:
పతుమ్ నిస్సాంక, కమిల్ మిశారా, కుశల్ మెండిస్ (వికెట్‌కీపర్), పవన్ రత్నాయకే, కమిందు మెండిస్, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత, దుష్మంత చమీర, మహీష్ తిక్షణ, దిల్షాన్ మధుశంక
ఇంగ్లండ్ జట్టు:
ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్‌కీపర్), జేకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), సామ్ కరన్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్
