Kitchen Telangana:  బిర్యానీ, పలావ్ లకు వీటిని కలపాల్సిందే.. లేదంటే ఉప్పు తక్కువైన కూరలా ఉంటది..!

Kitchen Telangana:  బిర్యానీ, పలావ్ లకు వీటిని కలపాల్సిందే.. లేదంటే ఉప్పు తక్కువైన కూరలా ఉంటది..!

బిర్యానీ, పలావ్​లకు సాలన్, గ్రేవీలు జత చేరకపోతే.... ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. అచ్చంగా కూరలో ఉప్పు తక్కువైతే నోటికి ఎట్లయితే రుచి అందదో అట్లనే... అందుకే  ఇప్పుడు రెండు సాలన్ వెరైటీలు, ఒక గ్రేవీ వెరైటీ మీ కోసం...

బిర్యానీ గ్రేవీ తయారీకి కావాల్సినవి

  • నూనె- రెండు టేబుల్ స్పూన్లు
  • ఉల్లిగడ్డ (పెద్దది)- ఒకటి
  • టొమోటాలు ( మీడియం సైజు) – రెండు
  • పచ్చిమిర్చి (నిలువుగా చీల్చి) రెండు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్- ముప్పావు టీస్పూన్
  • ఉప్పు - అర టీస్పూన్ లేదా సరిపడా
  •  పసుపు- పావు టీస్పూన్ 
  • కొబ్బరి (తురుము)- నాలుగు టేబుల్ స్పూన్లు
  • పుదీనా (తరుగు)–మూడు టేబుల్ స్పూన్లు
  • కారం– ఒక టీ స్పూన్​
  • బిర్యానీ మసాలా పొడి–ఒక టీస్పూన్​
  • మంచి నీళ్లు- రెండు కప్పులు 
  • పెరుగు - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు

 మసాలా కోసం కావలసినవి

  • బిర్యానీ ఆకు - చిన్నది ఒకటి
  • జాపత్రి-కొంచెం
  • ఆకుపచ్చ యాలక్కాయలు- మూడు
  • బిర్యానీ మసాలా పువ్వు - రెండు రెమ్మలు
  • లవంగాలు - మూడు
  • దాల్చిన చెక్క - చిన్నముక్క
  • షాజీర- అర టీస్పూన్

బిర్యానీ గ్రేవీ తయారీ విధానం

వేడి చేసిన పాన్​ లో సగం నూనె పోసి ఉల్లి గడ్డ తరుగు, మిర్చి వేసి ఉల్లి ముక్కలు బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేగించాలి. టొమాటో తరుగు వేసి ఉప్పు చల్లి మిశ్రమాన్ని బాగా ఉడికించాలి.

తరువాత కొబ్బరి వేసి మరో ఐదు నిమిషాలు ఉంచాలి. చల్లారాక ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసేటప్పుడు కొన్ని నీళ్లు కలిపితే మెత్తటి గుజ్జులా అవుతుంది.

మళ్లీ పాన్ వేడిచేసి మిగిలిన నూనె పోసి పొడి మసాలా దినుసుల్ని వేసి కొంచెం పుదీనా కూడా వేసి ఒక నిమిషం వేగించాలి. గ్రైండ్ చేసిన టొమాటో, ఉల్లి మిశ్రమాన్ని పాన్​ లో వేసి కారం, పసుపు, మసాలా పొడి వేయాలి.

►ALSO READ | టూల్స్ అండ్ గ్యాడ్జెట్స్: నాన్ స్టిక్ ప్యాన్ లకు గీట్లు పడకుండా.. ప్యాన్ హ్యాండిల్

అవసరం అనుకుంటే మరికొంచెం ఉప్పు వేయొచ్చు. నీళ్లు పోయొచ్చు. ఈ మిశ్రమాన్ని ఉడికించి పెరుగు వేసి బాగా కలపాలి.

పదినిమిషాలు సన్నటి మంట మీద ఉంచాలి. లేదా గ్రేవీలా అయ్యేవరకు ఉంచాలి. ఈ షోర్బాను బిర్యానీ లేదా పలావ్ తో కలిపి తింటే బాగుంటుంది.

క్యాప్సికమ్ సాలన్ తయారీకి కావాల్సినవి

 

  • నూనె - రెండు టేబుల్ స్పూన్లు
  • ఉల్లిపాయలు (తరిగి)- ముప్పావు కప్పు
  • టొమాటోలు (చిన్నవి తరిగి)- రెండు
  • జీడిపప్పులు - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
  • కనూరి మేథి - అర టీస్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - ముప్పావు టేబుల్ స్పూన్
  • కారం - అర టీస్పూన్
  • క్యాప్సికమ్ (ముక్కలు) - ఒక కప్పు
  • పచ్చి బఠాణీలు - అర కప్పు
  • ఉప్పు- రుచికి సరిపడా
  • పసుపు - కొంచెం

గ్రేవీ కోసం

  • బిర్యానీ ఆకు సగం
  • స్టార్ అనీస్- ఒకటి
  • నల్ల యాలక్కాయ - ఒకటి
  • మిరియాలు - పావు టీస్పూన్
  • దాల్చిన చెక్క - చిన్న ముక్క
  • లవంగాలు- అర టేబుల్ స్పూన్
  • ధనియాలు - రెండు టేబుల్ స్పూన్లు
  • షాజీర - ఒక టేబుల్ స్పూన్
  • మేస్ ఫ్లవర్ –సగం
  • జాజికాయ (తురుము) – పావు టీస్పూన్

క్యాప్సికమ్​ సాలన్​ తయారీ విధానం

జీడిపప్పు తప్ప మిగిలిన మసాలా దినుసులన్నింటినీ నూనె వేయకుండా వేగించి మెత్తటి పొడిలా చేయాలి. పాన్​ లో నూనె వేడిచేయాలి.

ఉల్లి తరుగువేసి ఓ మాదిరి మంట మీద లేత బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. మంట తగ్గించి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక టొమాటోలు వేయాలి. పైనుంచి టొమాటో తరుగు వేసి ఉప్పు, పసుపు వేసి ఓ మాదిరి మంట మీద టొమాటోలు గుజ్జుగా అయ్యే వరకు ఉడికించాలి.

జీడిపప్పు వేసి ఒక గిన్నెలోకి తీసి చల్లారబెట్టాలి. ఉల్లి, టొమాటో మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి కొన్ని నీళ్లు కలిపి మెత్తటి గుజ్జులా గ్రైండ్ చేయాలి.

మసాల వేగించిన పాన్​ లోనే కొంచెం నూనె వేడి చేయాలి. అందులో బిర్యానీ ఆకు ముక్కలు, జీలకర్ర వేసి అవి చిటపటమన్న తరువాత క్యాప్సికమ్. పచ్చి బఠాణీలు వేసి స్టవ్ మంట పెంచి మూడు నిమిషాలు వేగించాలి. అయితే మాడకుండా చూసుకోవాలి.

మిక్సీ పట్టిన మిశ్రమాన్ని పోసి కారం,కనూరి మేథి ముప్పావు టీస్పూన్ మసాలా పొడి వేసి బాగా కలపాలి. అవసరమనుకుంటే నీళ్లు కలపొచ్చు. మిశ్రమం ఉడుకుపట్టగానే మూత పెట్టి స్టవ్ మంట తగ్గించాలి. క్యాప్సికమ్ ముక్కలు మెత్తగా అవ్వాలి.

మరీ ఎక్కువగా ఉడికించొద్దు. ఈ ప్రాసెసు పావుగంట టైం పడుతుంది. రెడీ అయిన క్యాప్సికమ్. సాలన్​ ను మీకు నచ్చిన బిర్యానీతో కలిపి తింటే ఆ టేస్టే వేరు.