హైదరాబాద్: ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి, ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఇబ్రహీంపట్నం పోలీసులు నోటీసులు జారీ చేశారు. క్రైం నెంబర్ 119/2026 కింద BNSS సెక్షన్ 35(3) ప్రకారం పోలీసులు నోటీసు జారీ చేశారు. కౌన్సిలర్ ఎన్నికల సర్టిఫికేట్, మొబైల్ ఫోన్ బలవంతంగా లాక్కొని, బాధితుడిని మూడు రోజుల పాటు నిర్బంధించారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో పలు సెక్షన్ల కింద నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు బాధితుడి ఫోన్ వెంటనే తిరిగి ఇవ్వాలని సూచించారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో స్పష్టం చేశారు. నిబంధనలు పాటించకపోతే అరెస్ట్ చేసే అవకాశముందని పోలీసులు హెచ్చరించారు.
►ALSO READ | కామారెడ్డిలో టెన్షన్ టెన్షన్.. రాజాసింగ్ అరెస్ట్.. కామారెడ్డికి వెళ్లే అన్ని రూట్లలో చెక్ పోస్టులు..
* ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన పోలీసులు
* ఇంటికి తాళం ఉండడం వల్ల వారు అందుబాటులో లేకపోవడంతో, హైదరాబాద్ మలక్‌పేట్‌లోని తిరుమల హిల్స్‌లో ఉన్న వారి నివాసానికి వెళ్లిన పోలీసులు
* నోటీసులు అతికించి, పలు సెక్షన్ల కింద ఇద్దరిపై కేసు నమోదు
