
RTC సమ్మెపై ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరణ లేకపోవడంతో సీరియస్ అయ్యింది జాతీయ బీసీ కమిషన్. ప్రభుత్వ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీల హక్కులను పరిరక్షించే బాధ్యత తమకుందని తెలిపింది. సమ్మె విరమణకు తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలని ఆదేశించింది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలతో పూర్తి స్థాయి నివేదికను నవంబర్ 5 లోపు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.