హైదరాబాద్, వెలుగు: బీసీ గురుకుల సొసైటీ పరిధిలో ఇంటర్, డిగ్రీ కాలేజ్ అడ్మిషన్ల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. మొదటి దశలో సీట్లు సాధించిన విద్యార్థులు సోమవారం నుంచి ఈ నెల 30వ తేదీ లోపు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సొసైటీ సెక్రటరీ సైదులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా, కేవలం పదో తరగతిలో విద్యార్థులు సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగానే ఈ సీట్లను కేటాయించినట్టు ఆయన చెప్పారు.
అడ్మిషన్లకు సంబంధించి విద్యార్థులు తమ ఫలితాలు, కాలేజీ వివరాలను https://mjptbcwreis.telangana.gov.in, https://mjptbcadmissions.org/MJP-Inter అధికారిక వెబ్‌సైట్లలో చూసుకోవాలని సూచించారు. డిగ్రీ కాలేజీ అడ్మిషన్ల ఫలితాలు https://mjptbcadmissions.org/MJP-Degree/ అధికారిక వెబ్ సైట్ ద్వారా
తెలుసుకోవచ్చని సెక్రటరీ పేర్కొన్నారు.
