- మరో ఇద్దరు తొలగింపు
గంగాధర, వెలుగు: పదో తరగతి విద్యార్థులు తొమ్మిదో తరగతి విద్యార్థులను చితకబాదిన ఘటనలో కరీంనగర్ జిల్లా గంగాధర బీసీ బాలుర గురుకుల పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ జైసింగ్, మరో ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ బీసీ గురుకులాల సెక్రటరీ సైదులు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. తమకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదనే కారణంతో శుక్రవారం రాత్రి 20 మంది పదో తరగతి విద్యార్థులు 12 మంది తొమ్మిదో తరగతి విద్యార్థులను చితకబాదారు.
ఆ రోజు రాత్రి విధుల్లో ఉన్న మ్యాథ్స్ టీచర్ రమేశ్, వాచ్ మన్ శంకర్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరుగుతున్నా పట్టించుకోకపోవడం, శనివారం ఉదయం ప్రిన్సిపాల్ కు చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
