హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లకోసం అక్టోబర్18న జరిగే తెలంగాణ బంద్ విజయవంతం చేయాలన్నారు బీసీ జేఏసీ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య. బంద్ కేవలం ఏఒక్కరికోసమో కాదు.. బీసీలందరి కోసం.. బీసీలందరూ పాల్గొనాలి.. ఈ బంద్ దారి తప్పొద్దు.. ఒక్క ఎమర్జెన్ఈ సిరీస్ తప్ప అన్ని విభాగాలు బంద్ లో పాల్గొంటాయి. శాంతియుతంగా బంద్ చేయాలని ఆర్ కృష్ణయ్య కోరారు.
సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో బీసీ జేఏసీకి మద్దతు ఇచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్కృష్ణయ్య మాట్లాడుతూ.. ఏ పార్టీలతో జేఏసీకి సంబంధం లేదు.. బీసీల బాగుకోసం కొట్లాడుతున్నాం.. ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో పోరాటం చేస్తే కొంత న్యాయం జరిగిందన్నారు. ఆ స్పూర్తితో ఉద్యమం కొనసాగుతుందన్నారు.
ఎక్కువ మంది పేదలు బీసీల్లోనే ఉన్నారు.. వారి బాగుకోసమే ఉద్యమం కొనసాగుతోంది. బీసీలంటే చిన్నచూపు చూస్తున్నారు. 70యేళ్లుగా అన్యాయం, అవమానం జరుగుతూనే ఉంది.. బీసీలకు అన్యాయం జరిగితే భూకంపం సృష్టిస్తామన్నారు. రెడ్డి జాగృతి పోరాటం చేయాలి.. కానీ న్యాయంగా ఉండాన్నారు ఆర్ కృష్ణయ్య.
జనాభా ప్రకారమే హక్కులుండాలి.. అక్టోబర్ 18న బంద్ కు ఎమర్జెన్సీ సిరీస్ తప్పా అందరూ బంద్ కు సపోర్టు చేస్తున్నారు. బంద్ శాంతియుతంగా నిర్వహించాలి. రాజ్యాధికారం వచ్చే వరకు బీసీ పోరాటం ఆగదన్నారు ఆర్కృష్ణయ్య.
బీసీ జేఏసీ సభ్యులు జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఏ కోర్టు మాకు న్యాయం చేయడంలేదు.. కోర్టుపై మాకు నమ్మకంలేదు.. మోదీ, రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటే చాయ్ తాగినంత సమయంలో పరిష్కారం దొరుకుతుంది. కానీ వారు అలా చేయడం లేదు. అందరూ న్యాయం చేస్తామంటున్నారు కానీ అది ఎక్కడా కనిపించడం లేదు. నేతి బీరకాయ చందంగా మారింది బీసీల పరిస్థింది..బీసీలంటే ఏంటో చూపిస్తాం.. గ్రామాల్లో ఇప్పటికే బీసీ ఉద్యమం ఉపందుకుంటుంది. జేఏసీకి మంచి మద్దతు లభిస్తోందన్నారు జాజుల శ్రీనివాస్.
మరోవైపు బీసీ ఉద్యమానికి జర్నలిస్టుల తమ కలాన్ని ఆయుధాలుగా మార్చాలని కోరారు బీసీ జేఏసీ సభ్యులు దాసు సురేష్. మీడియా సంస్థలకు మూల స్తంభాలు బీసీలే.. బీసీల ఆత్మగౌరవ పోరాటానికి అండగా నిలవాలని - మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేశారు. అక్టోబర్18న జరిగే బంద్కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు.
