
బషీర్‌బాగ్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే వరకు ప్రభుత్వాన్ని వదిలేది లేదని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు. మంగళవారం కాచిగూడలో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో బీసీ నాయకులతో కలిసి ఈ నెల 31న నిర్వహించనున్న ‘బీసీ యుద్ధభేరి’ వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్‌పై పూర్తి అధికారం ఉందని, కేంద్రానికి సంబంధం లేదని, న్యాయపరమైన చిక్కులు లేకుండా 42% రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు నందగోపాల్, నీల వెంకటేష్, వేముల రామకృష్ణ, పి. సుధాకర్, అంజి తదితరులు పాల్గొన్నారు.