WTC ఫైనల్కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

WTC ఫైనల్కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

ఆస్ట్రేలియాతో జూన్ 7 నుంచి 11 వరకు జరిగే  ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ కు15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా సీనియర్ బ్యాట్స్ మెన్ అజింక్యా రహానెకు సెలక్టర్లు జట్టులో చోటు కల్పించారు.  15 నెలల తర్వాత రహానే తిరిగి భారత జట్టులోకి వచ్చాడు. అతను చివరిసారిగా జనవరి 2022లో దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో ఆడాడు.

ఇక  స్టార్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కకపోగా, ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా జట్టులోకి వచ్చాడు. జూన్ 7 నుంచి ఇంగ్లాండ్ ఓవర్ గ్రౌండ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.  అటు ఇప్పటికే ఆసీస్ కూడా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌  కు జట్టును ప్రకటించింది. ఇరు జట్ల మధ్య ఇటీవల జరిగిన 4 మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ సేన 2-1తో విజయం సాధించింది. 

భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే,కేఎల్ రాహుల్, కేఎస్  భరత్ (వికెట్ కీపర్),  అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ మరియు జయదేవ్ ఉనద్కత్.