మా ట్రోఫీని ఎందుకివ్వరు?..ఏసీసీ ఏజీఎంలో నఖ్వీపై బీసీసీఐ ఆగ్రహం

మా ట్రోఫీని ఎందుకివ్వరు?..ఏసీసీ ఏజీఎంలో నఖ్వీపై  బీసీసీఐ ఆగ్రహం

దుబాయ్: ఆసియా కప్ నెగ్గిన ఇండియాకు ట్రోఫీని అందజేయకపోవడంపై బీసీసీఐ మంగళవారం జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) వార్షిక సర్వసభ్య సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

  బీసీసీఐవైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, మాజీ ట్రెజరర్ ఆశిష్ షెలార్ ‘ట్రోఫీని గెలిచిన జట్టుకే అప్పగించాలి. ఇది ఏసీసీ ఆస్తి, ఏ వ్యక్తికీ చెందదు’ అని స్పష్టం చేశారు. అయినప్పటికీ, నఖ్వీ అయితే, ఈ అంశాన్ని ఏజీఎంలో చర్చించకుండా, వేరే సమయానికి వాయిదా వేయాలని మొండిగా పట్టుబట్టడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది.