సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌పై దృష్టి పెట్టాలి

సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌పై దృష్టి పెట్టాలి

న్యూఢిల్లీ: ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌కు ఎంపిక కావాలంటే సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ ముందుగా ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌, ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ క్రమశిక్షణపై దృష్టి పెట్టాలని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. రంజీల్లో టన్నుల కొద్ది రన్స్‌‌‌‌‌‌‌‌ చేసిన అతన్ని టీమిండియాకు ఎందుకు ఎంపిక చేయడం లేదని వస్తున్న వాదనలను బోర్డు తోసిపుచ్చింది. ‘సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌ ఆగ్రహాన్ని మేం అర్థం చేసుకున్నాం. కానీ ఒక ప్లేయర్‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేయడమనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. రెండు సీజన్లలో 900 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసిన సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌ను పక్కనబెట్టడానికి సెలెక్టర్లేమైన ఫూల్స్‌‌‌‌‌‌‌‌లాగా కనిపిస్తున్నారా? అతన్ని తీసుకోకపోవడానికి ప్రధాన కారణం ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌. ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆడే ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ లెవెల్స్‌‌‌‌‌‌‌‌ అతనికి లేవు. ఇందుకోసం అతను చాలా శ్రమించాలి. బరువు తగ్గి సన్నగా మరింత ఫిట్‌‌‌‌‌‌‌‌గా మారాలి. కేవలం బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌నే పరిగణలోకి తీసుకుంటే సరిపోదు. గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లోకి దిగేందుకు అవసరమైన అన్ని రకాల ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ ఉండాలి. ఇక ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌లో సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌ ప్రవర్తన ఏమాత్రం బాగా లేదు. చాలా అంశాలను మేం గమనించాం. అతనికి సరైన క్రమశిక్షణ లేదని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో అతను ఈ అంశంపై పని చేస్తాడని భావిస్తున్నాం. ఇందుకు సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌ తండ్రి, కోచ్‌‌‌‌‌‌‌‌ నౌషాద్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాం’ అని బీసీసీఐ అధికారి వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లోకి ఎంపిక కావడం చాలా కష్టంతో కూడుకున్నదని వివరించాడు.