పంజాగుట్ట, వెలుగు: అందాన్ని కాపాడుకుంటూనే ఆరోగ్యంపై సమాజానికి, ముఖ్యంగా గ్రామీణ మహిళలకు అవగాహన కల్పిస్తున్నామని పలువురు అందాల తారలు తెలిపారు. సోమాజిగూడ గ్రీన్‌ల్యాండ్స్‌లో ఆదివారం జరిగిన ‘బ్యూటిఫుల్ ఇండియా సీజన్-2’ విజేతల మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కె. శ్రీలహరి, సి. ప్రియాంక, దివ్యశ్రీ పెండ్యాల, స్నేహ తుమ్కూర్, డాక్టర్ సంధ్య ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.
సమాజంలో ప్రాణాంతకంగా మారుతున్న బ్రెస్ట్ క్యాన్సర్‌పై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లోపం వల్ల ఈ వ్యాధి బారిన పడి, వైద్యం చేయించుకోలేక పేదరికంతో ఇబ్బందులు పడుతున్న మహిళలను గుర్తించి, తమ సంస్థ తరఫున తగిన ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని ఈ సందర్భంగా వారు వెల్లడించారు.
