
యాదాద్రి భువనగిరి జిల్లా, వెలుగు: కరోనా బాధితులకు బీర్లా ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బీర్ల ఐలయ్య. మంగళవారం బీర్ల ఐలయ్య దంపతుల పెళ్లి రోజు సందర్భంగా నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఐలయ్య. యాదగిరిపల్లి ఎస్సీ కాలనీలో కరోనా బాధితులకు బీర్ల దంపతులు నిత్యావసర సరుకులు , కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. అలాగే వంగపల్లిలోని ఐకేపీ సెంటర్ లోని రైతులకు మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ చేశారు బీర్లా ఫౌండేషన్ ప్రతినిధులు. అనారోగ్యంతో మాసాన్ పల్లి గ్రామానికి చెందిన పాలడుగు రాములు ఇటీవల చనిపోవడంతో ఆయన కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం చేశారు. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన బీర్ల ఐలన్నకు నియోజకవర్గ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.