నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి: ఏసీపీ

నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి: ఏసీపీ

కోల్​ బెల్ట్, వెలుగు:​ రౌడీ షీటర్లు తమ నేరప్రవృత్తికి పూర్తిగా స్వస్తి పలకాలని, సమాజంలో గౌరవంగా బతకాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్​సూచించారు. సోమవారం మందమర్రి పోలీస్​స్టేసన్​లో మందమర్రి, రామకృష్ణాపూర్​ పోలీస్ ​స్టేషన్ల పరిధిలోని పాత నేరస్తులు, రౌడీషీటర్లకు కౌన్సెలింగ్​ నిర్వహించారు.

నడవడికలో మార్పు రాకుంటే చట్టపరంగా కఠినమైన చర్యలు ఉంటాయని.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా గొడవలు, ఆందోళనలకు పాల్పడితే కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతామని హెచ్చరించారు. సీఐ పర్స రమేశ్​, ఎస్సైలు శ్రీధర్, గోపతి నరేశ్​తదితరులు పాల్గొన్నారు.