నష్టపోయిన బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు

నష్టపోయిన బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు

ముంబై: యూఎస్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ డేటా వెలువడే ముందు బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు నష్టపోయాయి. వోలటాలిటీ ఎక్కువగా ఉన్న సెషన్‌‌‌‌‌‌‌‌లో  సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌ 147 పాయింట్ల (0.25 శాతం) లాస్‌‌‌‌‌‌‌‌తో 59,958 వద్ద గురువారం సెషన్‌‌‌‌‌‌‌‌ను ముగించింది. ఇంట్రాడేలో ఈ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ 473 పాయింట్లు పడింది. నిఫ్టీ 38 పాయింట్లు తగ్గి 17,858 దగ్గర క్లోజయ్యింది. గత మూడు సెషన్లలో సెన్సెక్స్ 789 పాయింట్లు పడగా,  నిఫ్టీ 243 పాయింట్లు (1.58 శాతం) తగ్గింది. సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌లో రిలయన్స్‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌, యాక్సిస్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌, టాటా మోటార్స్‌‌‌‌‌‌‌‌, కోటక్ మహీంద్రా బ్యాంక్‌‌‌‌‌‌‌‌, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌, బజాజ్ ఫిన్సర్వ్‌‌‌‌‌‌‌‌, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. అల్ట్రాటెక్ సిమెంట్‌‌‌‌‌‌‌‌,  లార్సెన్ అండ్ టుబ్రో, హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్ టెక్‌‌‌‌‌‌‌‌, మారుతి, హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ ట్విన్స్ లాభాల్లో ముగిశాయి.  విదేశీ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు బయటకు వెళ్లిపోవడం కొనసాగుతోందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. యూఎస్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ వెలువడే ముందు మార్కెట్ నిలకడగా లేదని పేర్కొన్నారు. హై వోలటాలిటీలో ట్రేడయిన ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు చివరికి కొద్దిపాటి లాస్‌‌‌‌‌‌‌‌తో ముగిశాయని  రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. బీఎస్‌‌‌‌‌‌‌‌ఈ మిడ్‌‌‌‌‌‌‌‌క్యాప్‌‌‌‌‌‌‌‌ గురువారం 0.24 శాతం పడగా, స్మాల్‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ 0.02 శాతం నష్టపోయింది.  ఆయిల్ అండ్ గ్యాస్‌‌‌‌‌‌‌‌, ఎనర్జీ, టెలీకమ్యూనికేషన్‌‌‌‌‌‌‌‌, బ్యాంకెక్స్‌‌‌‌‌‌‌‌, మెటల్‌‌‌‌‌‌‌‌, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు నష్టాల్లో ముగిశాయి. డాలర్ మారకంలో రూపాయి 81.57 దగ్గర సెటిలయ్యింది.

తగ్గిన యూఎస్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్

యూఎస్‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6.5 శాతానికి తగ్గింది. నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7.1 శాతంగా రికార్డయ్యింది. యూఎస్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ వరుసగా ఆరో నెల కూడా తగ్గడం విశేషం. ఫుడ్‌‌‌‌‌‌‌‌, ఎనర్జీ మినహాయించి, కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ నెల ప్రాతిపదికన డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో 0.3 శాతం పెరిగింది.  ఏడాది కిందటితో పోలిస్తే 5.7 శాతం ఎగిసింది. నెలవారీగా చూస్తే డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్  0.1 శాతం తగ్గింది. ఫ్యూయల్ ధరలు తగ్గడంతో ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ దిగొచ్చింది.