
ఇంటి గుమ్మం ముందు నిల్చుని, రెండు చేతులెత్తి దండం పెడుతున్నాయన బెంగళూరు కార్పొరేషన్ కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్ బీహెచ్ అనిల్ కుమార్… ఆవిడేమో భర్తను కోల్పోయిన ఓ ఇల్లాలు. ఆవిడ భర్తకు ఇటీవల కరోనాసోకింది. డాక్టర్ల సలహా మేరకు హోం ఐసోలేషన్లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. సడెన్ గా ఊపిరి అందట్లేదని చెప్పడంతో ఇంట్లో వాళ్లు అంబులెన్స్ కోసం ఫోన్ చేశారు. రెండు గంటలు గడిచినా అంబులెన్స్ రాకపోవడంతో ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా నడి రోడ్డుమీదే ప్రాణం పోయింది. ‘టైమ్కు అంబులెన్స్ పంపించడంలో విఫలమయ్యాం, మావల్లే మీరు భర్తను కోల్పోయారు.. మమ్మల్ని క్షమించండి’ అంటూ కమిషనర్ వేడుకున్నారు.