మండుతున్న ఎండలతో జాగ్రత్త : రాజారావు

మండుతున్న ఎండలతో జాగ్రత్త : రాజారావు

పద్మారావునగర్, వెలుగు: ఎండలు తీవ్రమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచే వేడి సుర్రుమంటోంది. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఈనేపథ్యంలో ఎండల నుంచి రక్షించుకోవడం ఎలా? వడదెబ్బ లక్షణాలు, జాగ్రత్తలు, చికిత్స అంశాలపై గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొ.రాజారావు ‘వెలుగు’తో మాట్లాడారు. అనవసరంగా బయట తిరగొద్దని, వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎండలో బాగా తిరగడం వల్ల చెమట ద్వారా బాడీలోని లవణాలన్నీ బయటకు వెళ్ళిపోయి వీక్​అయిపోవడం, ఒళ్లు నొప్పులు, జ్వరం, కొన్నిసార్లు వాంతులు కూడా అవుతాయని తెలిపారు. 

‘ఉదయం 11 నుంచి మద్యాహ్నం 3 గంటల మధ్య బయట తిరగకపోవడం బెటర్. అవసరమైతే లూజ్‌గా ఉండే కాటన్​ దుస్తులు ధరించి, గొడుగు పట్టుకొని వెళ్లాలి. మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి లిక్విడ్స్ తరచూ తీసుకోవాలి. నాన్​వెజ్, మసాలా, ఫాస్ట్​ఫుడ్‌, ఫ్యాటీ ఫుడ్‌, ఆల్కహాల్ లాంటి వాటికి దూరం ఉంటే మంచిది’ అన్నారు. సమ్మర్‌‌లో ఆహార పదార్థాలు తొందరగా పాడైపోతాయని, పొద్దున వండింది తిరిగి వేడి చేసుకొని సాయంత్రం తినకూడదని సూచించారు.-