భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో భద్రాద్రి కళాభారతి 24వ అంతరాష్ట్ర స్థాయి నాటకోత్సవాల బ్రోచర్‌ను ఆలయ ఈవో దామోదర్‌రావు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 20,21,22 తేదీల్లో జరిగే నాటకోత్సవాలకు పలు రాష్ట్రాల నుంచి కళాకారులు వచ్చి నాటికలను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు.
భద్రాచలంలో 24 ఏండ్లుగా నాటకోత్సవాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. భద్రాద్రి కళాభారతి అధ్యక్షుడు పాకాల దుర్గాప్రసాద్, తాళ్లూరి పంచాక్షరయ్య, తాండ్ర రమణారావు, అల్లం నాగేశ్వరరావు పాల్గొన్నారు.
