- కలెక్టర్ జితేశ్ వి పాటిల్
చండ్రుగొండ, వెలుగు : వ్యవసాయ పంటల సాగులో కెమికల్స్ వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టి సారించాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ రైతులకు సూచించారు. బుధవారం గానుగపాడు గ్రామంలో బయోచార్ తయారీ, వినియోగంపై రైతులకు కలెక్టర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి కట్టెను కాల్చి బొగ్గుగా తయారు చేసి పశువుల మూత్రంలో కలిపిన పేడతో పంటలకు ఎరువుగా వేయాలన్నారు. ఎకరం భూమిలో మూడు పంటలు వేయడం ద్వారా ఖర్చు తగ్గి దిగుబడులు సాదించవచ్చని తెలిపారు.
రైతులకు ఉన్న భూమిలో అడుగు లోతు, వెడల్పులో గుంత తవ్వి సాగు చేసిన పంట కట్టె కాల్చి ఎరువు తయారు చేయాలని సూచించారు. మునగ సాగు, కౌజు పిట్టల పెంపకంపై రైతులు దృష్టి సారించాలని చెప్పారు.డీఆర్డీఏ పీడీ విద్యాచందన, తహసీల్దారు సంధ్యారాణి, ఎంపీడీవో అశోక్, అగ్రికల్చర్ ఆఫీసర్ వినయ్, సర్పంచులు, సెక్రటరీలు, ఈజీఎస్, సిబ్బంది పాల్గొన్నారు.
