భద్రాచలం: ఆలయ పనులు గడువులోగా పూర్తి చేయాలి : కలెక్టర్ అంకిత్

భద్రాచలం: ఆలయ పనులు గడువులోగా పూర్తి చేయాలి : కలెక్టర్ అంకిత్

భద్రాచలం, వెలుగు : సీతారామచంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులతో ఆలయ ఔనత్యానికి ఎలాంటి భంగం కలగకుండా, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ ఇంజినీర్లను ఆదేశించారు. మంగళవారం ఆలయంలో జరుగుతున్న పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, భక్తులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు దర్శనం, ప్రసాద పంపిణీలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆఫీసర్లకు సూచించారు. ఉత్తరద్వారం పనులను పరిశీలించిన కలెక్టర్, ముక్కోటి ఏకాదశి నాటికి కొత్త ద్వారం పూర్తి చేయాలని, డ్రాయింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగా నాణ్యతతో పనులు చేపట్టాలని ఆదేశించారు.

తూర్పు, దక్షిణ, పడమర వైపు మెట్ల పనుల పురోగతిని సమీక్షించారు. ఆలయం నుంచి పుష్కరఘాట్ వరకు కాలినడకన వెళ్లారు. చిత్రకూట మండపం తొలగింపు పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. వచ్చే పుష్కరాల నాటికి అన్ని పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. సబ్ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ పాల్గొన్నారు.