వైభవంగా దమ్మక్క సేవాయాత్ర.. భద్రాచలం టెంపుల్ సన్నిధిలో శోభాయాత్ర

వైభవంగా దమ్మక్క సేవాయాత్ర.. భద్రాచలం టెంపుల్ సన్నిధిలో శోభాయాత్ర

భద్రాచలం, వెలుగు: ఆషాఢ పౌర్ణమి సందర్భంగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధిలో బుధవారం దమ్మక్క సేవాయాత్ర వైభవంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆదివాసీలు శోభాయాత్రగా స్వామివారికి పండ్లు, ఫలాలు సమర్పించారు. కొమ్ములు ధరించి రేలా నృత్యాలు చేస్తూ దమ్మక్క విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సర్పంచ్ పూనెం కృష్ణదొర, కొండరెడ్ల సంఘం నాయకులు ముర్ల రమేశ్, ఆలయ ఈవో దామోదర్‌‌‌‌రావు దమ్మక్క విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.