భద్రాచలం: మావోయిస్టుల డంప్ స్వాధీనం

భద్రాచలం: మావోయిస్టుల  డంప్ స్వాధీనం

భద్రాచలం, వెలుగు : ఛత్తీస్​గఢ్​రాష్ట్రం బీజాపూర్​జిల్లాలోని అడవుల్లో ఉన్న మావోయిస్టుల డంప్ లను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. తాడ్పాల్ పోలీస్​స్టేషన్ సమీప అడవుల్లో బీజీఎల్​తయారీ యంత్రాలకు సంబంధించిన పరికరాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 105 బీజీఎల్​లాంఛర్లు, 2 ఐరన్  పైపులు, అల్యూమినియం పాత్రలను గుర్తించారు. 

ఇదే జిల్లాలోని మిర్తూర్​పోలీస్​స్టేషన్​పరిధిలో ఇండరీపాల్​గుట్టల్లో 2 బీజీఎల్​లాంఛర్లు, ఐదు బాణాల బాంబులు, డుమరీపాల్​అడవుల్లో ఏడు బండిళ్ల నాన్​ఎలక్ట్రిక్​వైర్, ఆరు డిటోనేటర్లను డంప్​నుంచి వెలికితీశారు. ఈ డంపులను బీజాపూర్​ఎస్పీ ఆఫీస్ కు తరలించారు.