ఖమ్మం టౌన్, వెలుగు : సిద్దిపేటలో భద్రాద్రి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ 25వ బ్రాంచ్ ను ఆ బ్యాంకు చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సిద్దిపేట జిల్లా సహకార అధికారి జి.వరలక్ష్మి హాజరై బ్యాంకు స్ట్రాంగ్ రూమ్ ను ప్రారంభించారు.
కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నేతి కైలాసం, ఐఎంఏ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బి.చందర్, బ్యాంకు డైరెక్టర్లు మద్ది చంద్రయ్య, శ్రీనివాసరావు, దారా జీవన్ రామ్, ఎంజీఎం నాగుబండి శ్రీనివాస్ రావు, మేనేజర్లు అనుమాస్ రాజు, రామారావు, జగన్మోహన్ పాల్గొన్నారు.
