ఐపీఓకి భారత్ బయోటెక్‌‌‌‌‌‌‌‌?..రూ.4వేల200 కోట్లు సేకరించనుంది!

ఐపీఓకి భారత్ బయోటెక్‌‌‌‌‌‌‌‌?..రూ.4వేల200 కోట్లు సేకరించనుంది!

న్యూఢిల్లీ: వ్యాక్సిన్లు తయారు చేసే హైదరాబాద్​ కంపెనీ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఐపీఓకి రానుందని, సుమారు  రూ.4,200 కోట్లు సేకరించాలని ప్లాన్ చేస్తోందని సమాచారం. ఐపీఓ చర్చల దశలో ఉందని,  సైజ్, టైమింగ్‌‌‌‌‌‌‌‌ మారొచ్చని పేర్కొన్నారు. భారత్ బయోటెక్‌‌‌‌‌‌‌‌ 1996లో ఏర్పాటవ్వగా, ఇప్పటివరకు గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా  900 కోట్లకు పైగా వ్యాక్సిన్లను సప్లయ్ చేసింది. 

వీటిలో కరోనా, హెపటైటిస్ బీ వ్యాక్సిన్లు, బర్న్స్, డయేరియా రెమెడీస్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. మరోవైపు ఐపీఓ మార్కెట్ డల్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తోంది.   గ్లోబల్ ట్రేడ్ అనిశ్చితి, ఏఐపై ఐటీ ఆందోళనలతో మార్కెట్స్ పడుతున్నాయి. దీంతో ఐపీఓకి వచ్చేందుకు కంపెనీలు ఆలోచిస్తున్నాయి. ఈ ఏడాది జియో, ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ ఐపీఓలు రానున్నాయి.