భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జులై 8.
మొత్తం ఖాళీలు: 7.
విభాగాల వారీగా ఖాళీలు: ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (ఈఏటీ) 4, టెక్నీషియన్ సి 3.
ఎలిజిబిలిటీ
ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ: గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత విభాగం లేదా సబ్జెక్టులో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, దివ్యాంగుల అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉంటే సరిపోతుంది.
టెక్నీషియన్– సి: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎస్ఎస్‌ఎల్‌సీతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు ఏడాది అప్రెంటిస్‌షిప్ శిక్షణ పూర్తి చేసి ఉండాలి. లేదా ఎస్ఎస్‌ఎల్‌సీతోపాటు సంబంధిత ట్రేడ్‌లో మూడేళ్ల నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.295, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
లాస్ట్ డేట్: జులై 8.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ bel-india.inను సందర్శించండి.
