
ఎమ్మెల్యే కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమాకర్క. కేటీఆర్ లేని అంశాలు మాట్లాడి తప్పు దోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అసలు విషయాలు మాట్లాడితే బీజేపీకి కోపం వస్తుందని కేటీఆర్ అంటున్నారని చెప్పారు. మాకు బీజేపీకి ఎలాంటి చీకటి ఒప్పందాలు లేవని తెలిపారు. కేంద్రం వివక్ష పై ఏం చేద్దామో చెప్పాలని సూచించారు.
కేంద్రం పై ఎలా పోరాడాలో చెబితే తీర్మాణం చేద్దామని తెలిపారు. పదేళ్లు బాగా చేస్తే ప్రజలు ఎందుకు ఓడించారని ప్రశ్నించారు. ఆవు కథలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట అని విమర్శించారు. సింగరేణిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ప్రయోజనాలే మాకు ముఖ్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.