ప్రజలను మీడియా తప్పుదారి పట్టించొద్దు: డిప్యూటీ సీఎం భట్టి

ప్రజలను మీడియా తప్పుదారి పట్టించొద్దు: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: నైనీ బ్లాకు బొగ్గు టెండర్లలో తన ప్రమేయం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అయినా నాపై, ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చినందున వాటిని రద్దుచేసి కొత్తగా పిలవాలని సింగరేణి సంస్థను ఆదేశించామని తెలిపారు. రాజకీయాల్లోకి తాను గాలికి వచ్చిన వాడిని కాదని చెప్పారు.  నైనీ బొగ్గు టెండర్ల విషయంలో తన పేరును ప్రస్తావిస్తూ ఓ పేపర్, మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన స్పందించారు. 

ఆదివారం హైదరాబాద్‌‌‌‌లోని ప్రజాభవన్‌‌‌‌లో  మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో విబేధాలు సృష్టించే ప్రయత్నం జరుగుతున్నది.  మంత్రుల మధ్య పంచాయితీ పెడతామంటే కుదరదు.. 40 ఏండ్ల పోరాటం నాది.. ఆత్మగౌరవంతో పని చేస్తున్నా. వ్యక్తిగత విషయాల జోలికి ఏ చానల్ వెళ్లకూడదు. మీడియా సంస్థల మధ్య ఏముందో తెలియదు.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు’’ అని అన్నారు. ఆ పత్రిక యజమానికి వైఎస్సార్‌‌‌‌‌‌‌‌పై ఉన్న కోపంతో తనపై ఈ వార్త రాసినట్టుగా కనిపిస్తున్నదని పేర్కొన్నారు.