ఫైబర్ నెట్ వర్క్ రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి చేస్తాం: భట్టీ విక్రమార్క

ఫైబర్ నెట్ వర్క్ రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి చేస్తాం: భట్టీ విక్రమార్క

హైదరాబాద్: తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మాట ఇచ్చామని..  మాట ప్రకారం రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో పాలనను తీసుకొచ్చామన్నారు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖమంత్రి మల్లు భట్టీ విక్రమార్క. తెలంగాణ ప్రజల్లో గుణాత్మక మార్పును తీసుకొస్తామని చెప్పారు.   డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖమంత్రి మల్లు భట్టీ విక్రమార్క అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన బడ్జెట్ పై ప్రసంగించారు.

గత ప్రభుత్వం సంక్షేమ పథకాలకు బడ్జెట్ లో భారీగా నిధులు కేటించినా.. ఖర్చు మాత్రం చేయలేదన్నారు. గత ప్రభుత్వం ఆదాయాన్ని రెట్టింపు చేసి చూపించిందని అన్నారు. మాది ప్రజల ప్రభుత్వం.... ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలు నెరవేరుస్తున్నాం. .సమానత్వమే మా ప్రభుత్వ లక్ష్యం మా ప్రభుత్వం అందిరి కోసం బడ్జెట్ ను రూపొందించామని చెప్పారు.

also read : రైతు బంధు నిబంధనలు మార్పు.. రుణ మాఫీపై త్వరలో మార్గదర్శకాలు

రాష్ట్రంలో  అన్ని జిల్లాలో ఐటీ కంపెనీలను నెలకోల్పి నిరుద్యోగులకు ఉపాధిని కల్పిస్తామన్నారు.  తెలంగాణలోని యువత, నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలతోపా ప్రైవేట్ ఉద్యోగాలను కల్పిస్తామన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లి.. రూ.40 వేల పెట్టుబడులను తీసుకొచ్చారని తెలిపారు. అమెరికాలోని ఐటీసర్ అనే కంపెనీతో చర్చలు జరిపామని.. ఈ ఒప్పందం వల్ల మరిన్ని ఐటీ పరిశ్రమలు రాష్ట్రానికి వస్తాయని చెప్పారు. ఫైబర్ నెట్ వర్క్ ఉండే రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి చేస్తామన్నారు. ఐటీ శాఖకు రూ.774 కోట్ల కేటాయించినట్లు భట్టి తెలిపారు.