
నింగ్బో (చైనా): ఇండియా షూటర్ భవేశ్ షెకావత్.. ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్‌లో ఫైనల్ రేసులోనే కొనసాగుతున్నాడు. శుక్రవారం జరిగిన మెన్స్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో భవేశ్ నాలుగో ప్లేస్‌లో నిలిచాడు. 97, 99, 97 సిరీస్‌లో 239–9ఎక్స్ పాయింట్లు సాధించాడు. ప్రదీప్ సింగ్ షెకావత్ 288–8ఎక్స్‌తో 24వ స్థానంలో, మన్‌దీప్ సింగ్ 272–5 ఎక్స్‌తో 43వ స్థానంలో ఉన్నారు. విమెన్స్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్‌లో ఇండియా షూటర్లు ఎవరూ ఫైనల్‌కు చేరుకోలేదు.
మొహులీ ఘోష్ (583–23ఎక్స్), మణిని కౌశిక్ (580–22ఎక్స్) వరుసగా 23, 45వ ప్లేస్‌ల్లో నిలిచారు. సురభి భరద్వాజ్ రాపోల్ (578–23 ఎక్స్) 52వ ప్లేస్‌తో సరిపెట్టుకుంది. వరల్డ్ నంబర్ జీనెట్ హెగ్ డ్యూస్టాడ్ (నార్వే, 466.2), రికీ మాయెంగ్ ఇబ్సెన్ (డెన్మార్క్, 463.3), బార్బోరా డబ్‌స్కా (చెక్, 451.4) వరుసగా స్వర్ణం, రజతం, కాంస్యం గెలిచారు.