మా అమ్మనే అంటావా : తండ్రిని క్రికెట్ బ్యాట్ తో హత్యచేసిన 16ఏళ్ల కూతురు

మా అమ్మనే అంటావా : తండ్రిని క్రికెట్ బ్యాట్ తో హత్యచేసిన 16ఏళ్ల కూతురు

మధ్యప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. భూపాల్ కు చెందిన 16 ఏళ్ల బాలిక తన తండ్రిని క్రికెట్ బ్యాట్ తో హత్య చేసింది. భూపాల్ కు చెందిన బాధితుడికి  ఓ కొడుకు, కూతురు. కొడుకు సుతారీ పనిచేసి కుటంబాన్ని పోషిస్తుంటే తండ్రి రోజూ తాగి కుటంబసభ్యుల్ని చిత్రహింసలకు గురిచేసేవాడు. అయితే ఎప్పటి లాగే మద్యం తాగి ఇంటి వచ్చిన తరువాత కుటుంబసభ్యులు కొడుకు పెళ్లి గురించి చర్చించారు. ఈ సందర్భంగా బాధితుడు కొడిక్కి ఇప్పుడే పెళ్లి చేయాలా అంటూ భార్య ను పరుష పదజాలంతో దూషించాడు. దీంతో ఆగ్రహానికి గురైన బాలిక పక్కనే ఉన్న క్రికెట్ బ్యాట్ తో తండ్రి తలపై బలంగా కొట్టింది. బ్యాట్ బలంగా తలకు తగలడంతో బాధితుడు అక్కడిక్కడే కుప్పుకూలిపోయాడు. తలనుంచి రక్తస్త్రావం అవుతున్నా సరే తండ్రిని బ్యాట్ ఇంకా కొడుతూనే ఉంది. అప్పటికే బాధితుడు మృతి చెందాడు. అనంతరం నిందితురాలు పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలికను జువైనల్ హోంకి తరలించారు.