కుత్బుల్లాపూర్: జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గాజులరామారానికి చెందిన వ్యాపారి బీధల అశోక్ రెడ్డి (37) కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. 2026 అక్టోబర్ 7 (బుధవారం) ఉదయం పిల్లలను స్కూల్ వద్ద దించి వస్తుండగా కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు దాడి చేసి అశోక్ రెడ్డిని కిడ్నాప్ చేశారు.
కిడ్నాప్ విషయాన్ని ఫోన్ ద్వారా అశోక్ రెడ్డి భార్య స్వాతికి ఆకృతి స్కూల్ డ్రైవర్ తెలియజేశాడు. వ్యాపార భాగస్వామి చంద్రశేఖర్‌తో బిజినెస్ నష్టాల వేధింపులే కిడ్నాప్‌నకు కారణమని భార్య స్వాతి ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వకపోతే పిల్లలను కిడ్నాప్ చేసి చంపేస్తామంటూ గత 5 రోజులుగా బెదిరింపులకు దిగినట్లు తెలిపారు.
కిడ్నాప్ తర్వాత బాధితుడు అశోక్ రెడ్డి మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. భార్య స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు,నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.
