సంక్రాంతి బ్రహ్మోత్సవాలు: శ్రీశైల స్వామి, అమ్మవార్లకు భృంగివాహనసేవ

సంక్రాంతి బ్రహ్మోత్సవాలు: శ్రీశైల స్వామి, అమ్మవార్లకు భృంగివాహనసేవ

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల మల్లిఖార్జున స్వామి దేవాలయంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సోమ‌వారం నుంచి ప్రారంభ‌మ‌య్యాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజైన నేడు ( 12.01.2021)న స్వామి అమ్మవార్లకు భృంగివాహనసేవ జ‌ర‌గ‌నుంది, దేవ‌స్థానంలో రుద్రహోమం, చండీహోమం నిర్వహించ‌నున్నారు.ఉత్సవాలలో భాగంగానే చతుర్వేదపారాయణలు, రుద్రపారాయణ, చండీపారాయణ, , జపానుష్ఠానాలు జ‌రుగ‌నున్నాయి.

అయితే కోవిడ్ నివారణలో భాగంగా ఈ సంవత్సరం గ్రామోత్సవం నిలిపివేశారు. ప్రాకారోత్సవములోని ఆలయమాడవీధులలో శ్రీస్వామి, అమ్మవార్ల ఊరేగింపు జ‌రగ‌నుంది. 13వ తేదీన ఉదయం ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో సామూహిక భోగిపండ్ల కార్యక్రమం , 14వ తేదీన మహిళలకు ముగ్గులపోటీలు , 16వ తేదీన వేదసభ కార్యక్రమం జ‌ర‌గ‌నుంది. కనుమ పండుగ రోజున (15.01.2021) సంప్రదాయబద్దంగా గో పూజ మరియు బాలబాలికలకు వ్యాసరచన, వకృత్త్వ (ఉపన్యాస) పోటీలు నిర్వ‌హించ‌నున్నారు.