వడ్ల కొనుగోలులో రైతులను ఇబ్బంది పెట్టొద్దు : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి  

వడ్ల కొనుగోలులో రైతులను ఇబ్బంది పెట్టొద్దు : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి  

 యాదాద్రి, వెలుగు :  వడ్ల కొనుగోలులో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి సూచించారు. యాదాద్రి జిల్లా వలిగొండలోని రైస్​మిల్​ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వడ్ల కొనుగోలు, తాలు, తరుగు పేరుతో కటింగ్, అన్​లోడింగ్,  నిల్వలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు.

గడిచిన యాసంగి, వానాకాలం సీజన్లకు  సంబంధించిన వడ్లు మిల్లుల్లో ఉండడంతో స్పేస్​ ప్రాబ్లం ఏర్పడిందన్నారు. కేంద్రం సీఎంఆర్​ను సేకరిస్తే ఈ ఇబ్బంది ఉండదని చెప్పారు. ఇప్పటికైనా వెంటనే ఎఫ్​సీఐ సేకరించాలని ఆయన కోరారు. ఆయన వెంట డీసీఎస్​వో రోజా రాణి ఉన్నారు.